పోలీసు శాఖలో మరో సంచలనం… అడిషనల్ డీజీపీపైనే ఫిర్యాదు…

దిశ దశ, హైదరాబాద్:

సబార్డినేట్లు తమ పై అధికారిపై ఫిర్యాదు చేసే విధానం అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్నా పోలీసు విభాగంలో మాత్రం అత్యంత అరుదుగా చోటుచేసుకుంటుంది. డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్ కావడంతో తమకన్నా ఎక్కువ హోదాలో ఉన్న అధికారులపై కింది స్థాయిలో పనిచేసే వారు ఫిర్యాదు చేయడమన్నదే జరగదు. కానీ తాజాగా ఓ పోలీసు అధికారి ఏకంగా అడిషనల్ డిజీపీ పైనే ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. నార్సింగిలో ఇన్సెపెక్టర్ గా పనిచేసిన గంగాధర్ అడిషనల్ డీజీసీ స్టీఫెన్ రవింద్రపై గురువారం ఫిర్యాదు చేశారు. సీఎం, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఓపీటీకి ఈ కంప్లైయిట్ కాపీలను పంపించారు. ఓ భూ వివాదంలో తల దూర్చానంటూ ఎలాంటి విచారణ జరపకుండానే తనను సస్పెండ్ చేశారని గంగాధర్ అందులో పేర్కొన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకే తాను కేసు నమోదు చేశానని, అయితే ల్యాండ్ గ్రాబర్స్ పై కేసు ఎందుకు పెట్టావంటూ తనను సస్పెండ్ చేశారని గంగాధర్ వివరించారు. శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రాంలోని సర్వే నెంబర్ 68, కొల్లూరు శివారులోని 278 సర్వే నెంబర్ లకు సంబంధించి ఓవర్ లాప్ భూ వివాదంలో కేసులు నమోదు చేశానన్న కారణ:తో తనను సస్పెండ్ చేశారన్నారు. సస్పెండ్ అయిన అధికారులపై మూడు నుండి ఆరు నెలలలోపున డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జీఓ ఉన్నప్పటికీ తనకు సంబంధించిన ఫైలును కావాలనే ఏడాదిన్నర పాటు పక్కనపెట్టారని గంగాధర్ ఆరోపించారు. తనను సస్పెండ్ చేయడం వల్ల డిపార్ట్ మెంట్లో తన పరువు పోవడమే కాకుండా తన బ్యాచ్ కు చెందిన వారంతా కూడా డీఎస్సీలుగా పదోన్నతి పొందినా తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. స్టీఫెన్ రవింద్ర తన సస్పెన్షన్ వ్యవహారం గురించి ఎలాంటి రిపోర్టు ఇవ్వకపోవడంతో డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ తనకు ప్రమోషన్ ఇవ్వలేదన్నారు. అయితే తన ప్రమోషన్ ను కన్సిడర్ చేయాలంటూ హై కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో మరోసారి నోటీసులు పంపించాల్సి వచ్చిందన్నారు. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర తన ప్రమోషన్ కు సంబంధించిన నివేదిక డీపీసీకి పంపించడంతో ఆలస్యంగా పదోన్నతి పొందానన్నారు. ఆయన నిర్ణయం వల్ల తాను ఏడాదిన్నర పాటు ఖాలీగా ఉండడంతో పాటు సకాలంలో ప్రమోషన్ పొందలేకపోయానని, తనలా చాలా మంది కింది స్థాయి అధికారులు ఆయన వల్ల సఫర్ అయ్యారని గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓను, హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

You cannot copy content of this page