దిశ దశ, హైదరాబాద్:
ఇస్రో శాస్త్రవేత్తలు తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు. గగన్ యాన్ మిషన్ కు ఎదురైన ఆటంకాలను అధిగమించి మరీ తమ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. దీంతో ఇస్రో మరో చరిత్రలో మరి రికార్డు అందుకుంది. శనివారం ఉదయం నుండి వాతావరణం అనుకూలించకపోవడంతో సమయాన్ని పొడగిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలు చివరి రెండు క్షణాల ముందు ప్రయోగాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. సాంకేతిక సమస్య ఎదురు కావడంతో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే 10 గంటలకు తిరిగి ప్రయోగించబోతున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాంకేతికంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు అవసరమైన కసరత్తులు చేసిన శాస్త్రవేత్తలు సక్సెస్ కావడంతో అంతరిక్ష పరిశోధనా కేంద్రాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. TV D1 టెస్ట్ ఫ్లైట్ మిషన్ సక్సెస్ గా ప్రయోగించామని మిషన్ డైరక్టర్ ఎస్ శివకుమార్ ప్రకటించారు. గగన్ యాన్ ప్రాజెక్ట్ కొద్దిసేపటి క్రితం శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి చేపట్టిన ఈ మిషన్ లో గగనంలో లాంఛ్ అయిన తరువాత మాడ్యూల్ గంగాళాఖాతంలో పడిపోయిందని ప్రకటించారు.
