మిచిగాన్ లో సుదర్శన యాగం…

దిశ దశ, అంతర్జాతీయం:

లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మరో సారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాలని విదేశాల్లో స్థిరపడ్డ ఇండియన్స్ ఆకాంక్షిస్తున్నారు. నమో కోసం ప్రత్యేకంగా అమెరికా దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలు ప్రత్యేకంగా సుదర్శన యాగం నిర్వహించారు. అమెరికాలోని మిచిగాన్ డెట్రాయిట్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ అమెరికా వాలంటీర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో ఇక్కడ స్థిరపడిన ఇండియన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మిచిగాన్ ఫార్మింగ్టన్ హిల్స్ భక్త హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సుదర్శన యాగం సందర్భంగా భారతదేశ జెండాలు, మోడీ విజయాన్ని కోరుతూ బ్యానర్లు, ప్లకార్డులతో అలంకరించారు. మోడికా పరివార్, మోడి 3.0 నినాదాలను వినిపించారు. భారత్ ను బలోపేతం చేసేందుకు దేశ ఓటర్లంతా కూడా బీజేపీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన ఓ వీడియోను కూడా విడెుదల చేశారు. భారత్, యూఎస్ఏ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే మోడీ ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టాల్సిందేనని ఎన్ఆర్ఐలు ఆశించారు. ప్రపంచలో భారత్ ను మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రధానిగా మోడీ ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్య్రక్రమంలో రాజేందర్ సందడి, రాంరెడ్డి మందా, విజయ్ వెంకట్, రఘు ఎరబాటి, హేమంత్ రాణా, రీతు రాణా, రాజేష్ కుట్టి, రవి గుమత్, సుశాంత్ తివారీ, బసవరాజ్, కపిల్ మిస్త్రీ, సచిన్ పాటిల్, బదరీ తలంకిలు పాల్గొన్నారు.

You cannot copy content of this page