ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం… పరిస్థితి విషమం

అనంతపురం జిల్లాలోఘటన

దిశ దశ, ఏపీ బ్యూరో:

రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉపాద్యాయుడి ఆత్మహత్యాయత్నం కలకలం లేపింది. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఐదు పేజీల లేఖ రాసిన ఉపాధ్యయుడు మల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఉపాధ్యాయుడు జిల్లాలోని విడపనకల్లు మండలం పాల్తూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. పెన్నో అహోబిలం వద్ద పురుగుల మందు తాగి, మాత్రలు కూడా మింగినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతినెల 5వ తేదీకల్లా జీతాలు ఇవ్వాలని, సీపీఎస్ వెంటనే రద్దు చేయాలని ఆ లేఖలో మల్లేష్ కోరారు. తన చివరి కోరికను నెరవేర్చాలంటూ ఉపాధ్యాయుడు రాసిన లేఖలో కోరారు. ఉపాధ్యాయుడు మల్లేష్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లేష్ కుటుంబ సభ్యులను టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు పరామార్శించారు. మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page