దిశ దశ, హుజురాబాద్:
రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. యువతీ, యువకుని శవాలను రైల్వే పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి మార్గమధ్యలోని రైల్వే ట్రాక్ పై ఇద్దరు చనిపోయి ఉన్నారన్న సమాచారం అందుకున్న మంచిర్యాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. H 52 గూడ్స్ ట్రైన్ కిందపడి వీరిద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. 18 ఏళ్ల వయసు ఉన్న వీరిలో ఒకరు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మినుగు రాహుల్ గా గుర్తించగా యువతిని గుర్తించాల్సి ఉంది. వీరి మృతదేహాలను జమ్మికుంట ఆసుపత్రికి తరలించామని మంచిర్యాల రైల్వే ఎస్ఐ ఏ మహేందర్ దర్యాప్తు చేస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 9701112343, 8712658596 నంబర్లకు కాల్ చేసి సమాచాం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.