ఢిల్లీ ఎక్సైజ్ కేసులో సమన్లు జారీ చేసిన కోర్టు

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఢిల్లీ ఎక్సైజ్ స్కాం కేసు రౌస్ ఎవిన్యూ కోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ వేసిన రెండో అనుబంధ ఛార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసి ఈ నెల 22న కోర్టుకు హాజారు కావాలని ఆదేశించింది. రాజేష్ జోషీ, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చరణ్ ప్రీత్ సింగ్ లు కూడా ఈ కేసులో నిందితులని పేర్కొంటూ సీబీఐ ఛార్జి షీట్ లో పేర్కొంది. మరో వైపున ఈ కేసులో నిందితునిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాపై సీబీఐ ఛార్జిషీట్ వేసింది. ఈ కేసులో మొత్తంగా సీబీఐ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. రెండో చార్జిషీట్ ఆధారంగా సమన్లు జారీ చేసిన ఐదుగురు నిందితులు హాజరు కావల్సిన ఆగస్టు 22నే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ప్రధాన కేసు కూడా విచారణ ఉండడం గమనార్హం.

You cannot copy content of this page