బోణీ కొట్టిన బీజేపీ… సూరత్ అభ్యర్థి ఏకగ్రీవం

దిశ దశ, జాతీయం: 

ఎన్నికల ప్రక్రియ సాగుతున్న క్రమంలోనే భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం నుండే బీజేపీ ఖాతా ఓపెన్ చేయడంతో  ఆ పార్టీ శ్రేణుల్లో సంబరం వ్యక్తం అవుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానానికి బీజేపీ నుండి ముఖేష్ దలాల్, పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరో ఎనిమిది మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. మరో వైపున ఇక్కడి నుండి పోటీలో ఉన్న మరో ఎనిమంది అభ్యర్థులు కూడా పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కూడా ముఖేష్ కు గెలిచినట్టుగా దృవీకరణ పత్రం అందజేశారు. 

You cannot copy content of this page