వయో భారమా… అనారోగ్యమా..?

తారక్క లొంగుబాటుకు కారణం…

దిశ దశ, దండకారణ్యం:

నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానానికి గుడ్ బై చెప్పడానికి కారణమేంటీ..? అగ్రనేత సహచరిగా విప్లవ బాటలో ఉన్న ఆమె ఉన్నట్టుండి జనజీవనంలో ఎందుకు కలిశారు..? మావోయిస్టు పార్టీ కీలక నాయకురాలిగా ఉన్న ఆమె లొంగిపోవడమేంటీ అన్నదే హాట్ టాపిక్ గా మారింది.

అనారోగ్యమా..?

సిడాం విమల అలియాస్ తారక్క 1983లో విప్లవాలకు ఆకర్షితులై అడవి బాట పట్టారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన తారక్క పీపుల్స్ వార్ లో చేరిన తొలితర మహిళ అని అక్కడి పోలీసులు చెప్తున్నారు. పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు, DKSZC ఇంఛార్జిగా ఉన్న మలోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి సహచరి అయిన తారక్క ఇటీవలే డీకే ఏరియా కమిటీలో బాధ్యతలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో 170కి పైగా కేసులు ఉన్న తారక్క తలకు ఆయా రాష్ట్రాలు సుమారు 2 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి. పార్టీలో అత్యంత సీనియర్ నాయకురాలిగా ఉన్న ఆమె లొంగిపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. వయోభారం కారణంగా అడవుల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందా లేక అనారోగ్యానికి గురయ్యారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే కొంతకాలంగా మాత్రం అనారోగ్యంతో బాధ పడుతున్నారని మాత్రం ప్రచారం జరుగుతోంది. ఆధునిక వైద్యం అందుకోవల్సిన ఆవశ్యకత ఉన్న కారణంగానే తారక్క జనజీనంలో కలిసి ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుని సహచరిగా ఉన్న తారక్క లొంగిపోవడానికి బలమైన కారణం ఉంటుందన్న అభిప్రాయాలయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే తారక్క కొద్ది రోజుల క్రిమతే బయటకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు.

తెలంగాణాలో చర్చ…

తారక్క లొంగుబాటు అంశం గురించి తెలంగాణాలోని పలు జిల్లాల్లో చర్చనీయాంశం అయింది. తారక్క భర్త పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నమలోజ్జుల వేణుగోపాల్ రావు పెద్దపల్లి పట్టణ వాసి. ఆయన సోదరుడు కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ కూడా విప్లవపంథాలోనే అడవి బాట పట్టారు. సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఉన్న కిషన్ జీ 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. ప్రస్తుతం వేణుగోపాల్ రావు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండడం ఆయన భార్య తారక్క లొంగిపోవడంతో మలోజ్జుల కుటుంబం గురించి మరోసారి చర్చ మొదలైంది.

You cannot copy content of this page