దిశ దశ, కరీంనగర్:
మైన్స్ అండ్ జియోలాజి విభాగంలో ప్రక్షాళన మొదలైనట్టుగా ఉంది. ఉన్నతాధికారులు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డిప్యూటీ డైరక్టర్ ఎం వెంకటేశ్వర్లు, కరీంనగర్ అసిస్టెంట్ డైరక్టర్ రామాచారీలను సస్పెండ్ చేస్తూ మైన్స్ అండ్ జియోలాజి ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కరీంనగర్ గ్రానైట్ క్వారీలకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన అవకతవకల విషయంలోనే వీరిద్దరిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2013 సంవత్సరంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో వీరిని సస్పెండ్ చేశారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.