డబ్బులు పంచడాన్ని నిలువరించండి

ఆర్వోకు ఫిర్యాదు చేసిన కార్పోరేటర్ భర్త…

దిశ దశ, కరీంనగర్:

అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం హెచ్చుమీరుతోందని దానిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్ ఆమె భర్త, సామాజిక కార్యకర్త సోహన్ సింగ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సోమవారం కరీంనగర్ అసెబ్లీ ఎన్నికల అధికారులకు ఈ మేరకు కార్పోరేటర్ దంపతులు వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ లో నిస్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, అయితే యువతను మద్యానికి బానిసలుగా చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఖరీదైన మొబైల్ ఫోన్లు, పేద, మధ్య తరగతి వారికి డబ్బు ఆశ చూపిస్తున్నారని సోహన్ సింగ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డివిజన్ కు చెందిన కొంతమంది ఎన్నికల డబ్బులు ఇంకా పంచడం లేదా అని అడుగుతున్నారని, మహిళా సంఘాలకు ఓటుకు రూ. 5 వేల చొప్పున డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరుగుతోందని అన్నారు. తమ డివిజన్ కు ఇంకా రాలేదా అని అడుగుతున్నారని తెలిపారు. అయితే డబ్బులు పంచుతున్న అభ్యర్థులపై కఠినంగా వ్యవహరించి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

You cannot copy content of this page