దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయండి…

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎల్పీ కోరింది. ఈ మేరకు సోమవారం శాసనసభ స్పీకర్ ప్రసాద్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని అభ్యర్థించారు. చట్టం ప్రకారం ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని, శాసనసభా పక్ష నేత కేసీఆర్ ఆదేశాల మేరకే తామీ లేఖ ఇస్తున్నామన్నారు.

మూడు నెలలే: కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని `ఆయనపై ఖచ్చితంగా వేటు పడుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్పీకర్ కు వినతి పత్రం అందించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ… మూడు నెలల్లోనే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడపడం ఖాయమన్నారు. ఒక బీఫారంపై గెలిచి మరో పార్టీలోకి చేరడం ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుందన్నారు. పార్టీ ఫిరాయించిన మూడు నెలల్లోనే చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా స్ఫష్టం చేసిందన్నారు.

You cannot copy content of this page