హీరో విజయ్ ఆంటోని ఆరోగ్యం మరింత విషమం
తమిళ హీరో విజయ్ ఆంటోని ఆరోగ్యం మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల మలేషియాలో జరుగుతున్న సినిమా షూటింగ్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి చిత్ర బృందం తరలించింది. గత కొద్దిరోజులుగా కౌలారంపూర్లోని ఓ హాస్పిటల్లో వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లు చెబుతున్నారు. ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
అపస్మారక స్థితి నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు టెన్షన్ పడుతున్నారు. తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో.. విజయ్ ఆంటోని మొఖం గుర్తుపట్టలేనంతంగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఆయనకు దవడ భాగంలో బాగా దెబ్బ తగిలిందని చెబుతున్నారు. దీంతో ముఖానికి సర్జరీ చేయాలని వైద్యులు భావిస్తున్నారు. దీని కోసం చెన్నైకు విజయ్ ఆంటోనిని తరలించినున్నట్లు సమాచారం.
చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు సర్జరీ చేయనున్నారు. నేడు ఆయనను కౌలంపూర్ నుంచి చెన్నైకు తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉందనే వార్తలతో విజయ్ ఆంటోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తిరిగి కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకుని రావాలంటూ కోరుకుంటున్నారు. విజయ్ ఆంటోని ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ప్రస్తుతం బిచ్చగాడు 2 సినిమాలో విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం మలేషియాకు వెళ్లారు. షూటింగ్ లో పడవ అదుపు తప్పి కెమెరా, సినిమా యూనిట్ సిబ్బంది ఉన్న పడవను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోనితో పాటు మరికొంతమంది సినిమా యూనిట్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. వాళ్లు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. దీంతో ఆయన కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశముందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. విజయ్ ఆంటోని ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులకు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కాగా చిచ్చగాడు 1 సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.