2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో జాతీయ స్థాయిలో పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోండగా.. ఎలాగైనా బీజేపీని అధికారంలోకి దించేందుకు కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోన్నాయి.
ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషణల్ కాన్పరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా స్టాలిన్ ఎందుకు ఉండకూడదు? అంటూ ప్రశ్నించారు. స్టాలిన్‌ను అభ్యర్ధిగా పెడితే తప్పంటి అంటూ తెలిపారు. స్టాలిన్ బర్త్ డే సందర్భంగా చెన్నై వచ్చిన ఫరూక్ అబ్ధుల్లా.. ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
ఇప్పటికే బీహార్ సీఎం నితిష్ కుమార్ తో పాటు పలువురు జాతీయ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలను కలుపుకునేందుకు సిద్దమవుతోంది. స్టాలిన్ కూడా ఎప్పటినుంచో యూపీఏ కూటమిలో ఉన్నాడు. దీంతో స్టాలిన్ పేరును ప్రధానమంత్రి అభ్యర్ధిగా తెరపైకి తీసుకురావడం వెనుక ఏదైనా వ్యూహముందా అనే చర్చ జరుగుతోంది. దక్షిణాదిగా చెందిన నేత పీఎం అభ్యర్ధిగా ఉంటే కలిసొస్తుందనే ఫార్ములాను ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇప్పుడు తమిళనాడుకు చెందిన స్టాలిన్ ను పీఎం అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా సౌత్ ఇండియా కలిసొస్తుందని పలు పార్టీలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన పేరును తెరపైకి తీసుకొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీనే లీడ్ చస్తోంది ఇటీవల ఖర్గే చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇంతలోనే స్టాలిన్ పేరును తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.