ఆదర్శ వివాహ బంధంలో అపశృతి

నాలుక కొరుక్కున్న వైనం

దిశ దశ, ఏపీ బ్యూరో:

భార్యా భర్తల మధ్య మొదలైన వివాదాలు చివరకు నాలుక కొరుక్కునే స్థాయికి చేర్చాయి. నాలుక కొరుక్కోవడం అంటే ఇదే తప్పు చేశామని ఎవరి నాలుక వారే కొరుక్కోలేదక్కడ… కోపంతో ఉన్న భార్య ఏకంగా భర్త నాలుకను కొరికేసింది. అంతే లబోదిబోమంటూ ఆసుపత్రి పాలయ్యడా భర్త… సంఘటనా వివరాల్లోకి వెల్తే… కర్నూలు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పవతి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2015లో వైవాహిక బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవుల ముదిరిపాకాన పడ్డాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ గొడవలు కాస్తా తారస్థాయికి చేరిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా ఈ దంపతులిద్దరూ తగవులాడున్నారు. ఆ తరువాత తారాచంద్ నాయక్ భార్యను మచ్చిక చేసుకుందామనుకునే ప్రయత్నం చేశాడో ఆయనలోనే ప్రేమ ఎక్కువైందో తెలియదు కానీ డైరక్ట్ గా భార్య వద్దకు వెల్లి లిప్ కిస్ పెట్టే ప్రయత్నం చేశాడు. భర్తపై కోపంతో ఊగిపోతున్న పుష్పవతి భర్త తన చెంతకు రాగానే చటుక్కున అతని నాలుకను కొరికేసింది. ఊహించని విధంగా భార్య నుండి రెస్పాన్స్ రావడంతో తారాచంద్ నాయక్ ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే నాలిక కట్ కావడంతో వెంటనే గుత్తి హాస్పిటల్ కు వెళ్లగా ప్రాథమిక చికిత్స అందించిన స్థానిక వైద్యులు అనంతపూర్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. భార్య భర్తల మధ్య నెలకొన్న గొడవలు కాస్తా భర్త నాలుకను కొరికే స్థాయికి చేరిన విషయంపై స్థానికులు విచిత్రంగా స్పందిస్తున్నారు.

You cannot copy content of this page