తెలంగాణ బిల్లుకు తొమ్మిదేళ్లు పూర్తి

తెలంగాణ ఏర్పాటులో ఫిబ్రవరి 18 అత్యంత ముఖ్యమైన రోజుగా గుర్తింపు ఉంది. సరిగ్గా ఇదే రోజు లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 18 తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభ ఆమోదించిన.. ఫిబ్రవరి 20న రాజ్యసభ సైతం బిల్లును ఆమోదించింది. అక్కడి నుంచి మార్చి 1, 2014 వరకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలకు రూపు ఇస్తూ 2014 మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాజముద్ర పడింది.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత జూన్ 2వ తేదీని రాష్ట్ర అపాయింటెడ్ డేగా ప్రకటించడం అపూర్వమైన తరుణం. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014 జూన్ 2న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ బంగారు యాత్ర ప్రారంభమైంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు. ఆనాటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆఫోటోలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, పలువురు ఉన్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోద ముద్ర వేయడంతో సంబరాల్లో భాగంగా నాడు కేసీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు.

2014 ఫిబ్రవరి 18 తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు. సరిగ్గా ఇదే రోజు లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో దార్శనికత కలిగిన నాయకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమం విజయం సాధించింది అంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

You cannot copy content of this page