నాటు నాటు అంటే ఇదే..!

తెలంగాణ పోలీసుల కొత్త భాష్యం

నాటు నాటు నాటు నాటు అంటూ ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్, రాంచరణ్ లు డిఫరెంట్ స్టైల్లో డ్యాన్సు చేశి ప్రేక్షకులను ఉర్రూతలుగించారు కదా. దీంతో ఈ సినిమా హిట్ అయి పోవడమే కాదు… అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆనంద్ మహింద్రా కూడా ఈ పాటపై చెర్రితో కలిసి స్టెప్పులేసి ప్రాక్టికల్ గా నేర్చుకున్నాడు కూడా. అయితే ఈ పాటతో తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రెండింగ్ లో ఉన్న ఇలాంటి సాంగ్స్ అయితే బావుంటాయని భావించి వివిధ సోషల్ మీడియా వేదికలుగా తమ ప్రచారాన్ని చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచించి మరీ పోస్టు పెడుతున్న పోలీసుల తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు కూడా.

సైబర్ క్రైమ్స్ కు చెక్…

ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగిపోయిన సైబర్ క్రైమ్స్ ను కట్టడి చేసేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోలీసులు ట్రిపుల్ ఆర్ పోస్టర్ ను కూడా వాడేసుకున్నారు. say ‘‘na-to… sharing OTP say na-to… sharing credit card details say na-to… clicking on suspicious links say yes to Cyber Safety’’ అని రాసి పోస్ట్ వైరల్ చేస్తున్నారు. నెట్టింట్ వైరల్ అయిన ఈ పోస్టును చూసైన సొసైటీలో కొంతలో కొంత అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నారు తెలంగాణ పోలీసులు.

You cannot copy content of this page