దిశ దశ, హైదరాబాద్:
చోరీకి గురైన ఫోన్లను ట్రేస్ చేస్తున్న కేసుల్లో దేశంలో దక్షిణాది రాష్ట్రాలే ముందు వరసలో నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసులు సీఈఐఆర్ సాయంతో మొబైల్ ఫోన్లను గుర్తించడంలో రెండో స్థానంలో నిలిచారు. కర్ణాటక పోలీసులు 35945 ఫోన్లను రికవరీ చేయగా, తెలంగాణ పోలీసులు 30049 ఫోన్లు, మహారాష్ట్ర 15426, ఏపీ 7387 ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. 2023 ఏప్రిల్ 19న సీఈఐఆర్ ద్వారా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాగా తెలంగాణలో ఈ విభాగం నోడల్ అధికారిగా మహేష్ భగవత్ వ్వవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 780 పోలీసు సబ్ డివిజన్లలో రోజుకు 76 సెల్ ఫోన్లను సగటున రికవరీ చేశారు. గత 9 రోజుల్లోనే వెయ్యి ఫోన్లను తెలంగాణాలోని వివిధ ప్రాంతాల పోలీసు అధికారులు సీఈఐఆర్ సాయంతో స్వాధీనం చేసుకుని కంప్లైంట్ చేసిన వారికి అప్పగించారు.