దిశ దశ, పెద్దపల్లి:
మజ్లిస్ పార్టీ విషసర్పాలకంటే డేంజర్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి దారుస్సలాంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ చేసిందని, ముస్లింల ఓట్లను దండుకుని వారిని ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుని తింటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. దారుస్సలాం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కర్త, కర్మ, క్రియాగా ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు. నిరుపేద ముస్లింలకు దక్కకుండా వక్ఫ్ ఆస్తులను సమావేశం ఏర్పాటు చేసి వారిని తప్పుదోవ పట్టించుందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. ముస్లింలను మురికి కూపాల్లోకి నెట్టేసిన మజ్లిస్ పార్టీ నేతలు చాలా డేంజర్ అని, అంబేడ్కర్ పెట్టిన భిక్ష వ్లలే తాను ప్రధానిని అయ్యాయని పార్లమెంటులో ప్రకటించిన నరేంద్ర మోదీ ఆయన ఆశయాలకు అనుగుణంగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు పంచ్ తీర్థలను ఏర్పాటు చేసిన ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు. ఏలా లక్షా 35 వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం దేశంలో 8 లక్షల ఎకరాలకు పూగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, వీటి విలువు రూ. 10 లక్షల కొట్లకుపైగానే ఉంటుందన్నారు. వీటి ద్వారా ఏటా రూ. 12 వేల కోట్ల రూపాయల మేర వస్తున్న ఆదాయాన్ని దిగమింగుతోంది పెద్దలేనని, ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ. 2 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను ఆక్రమించుకుంది మీరు కాదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. వక్ఫ్ పేరుతో ఇతర మతాల ఆలయాలను, గురుద్వారాలను. ఆస్తులను కొల్లగొట్టింది ఈ దొంగలేనని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమర యోధుల చిహ్నాలతో పాటు పలు మతాల ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ ఆక్రమించుకున్నది నిజమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో 15వందల ఏళ్ల నాటి చంద్రశేఖర ఆలయా భూములను వక్ఫ్ భూములని స్వాధీనం చేసుకుంది నిజమా కాదా చెప్పాలన్నారు. హర్యానాలోని గురుద్వార్ భూమిని, కర్ణాటక లింగాయిత్ లకు చెందిన వ్యవసాయ భూమిని, కేరళలోని క్రైస్తవ మత్సకారుల భూములను వక్ఫ్ ఆస్తులుగా పేర్కొని క్లెయిమ్ చేసుకున్నారని, 77 వేల ఎకరాల వక్ఫ్ భూముల్లో 80 శాతం భూమిని ఈ దొంగలే స్వాధీనం చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులలో ఒక్క గజం స్థలం అయినా పేదలకు ఇవ్వలేదని, వీటి ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా పేద ముస్లింలకు ఖర్చు చేయలేదన్నారు. కనీసం పాతబస్తీలో మురికి కూపాల్లో బతుకుతున్న ముస్లింలకు కొంచెం జాగా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్దమా అని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. హైడ్రా ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తుల అక్రమాలపై విచారణ జరిపే దమ్ముందా అని అడిగారు. రాష్టంలో వక్ఫ్ భూములు ఎంత మేర ఉన్నాయి, ఆక్రమణలో ఉన్నదెవరూ..? అందులో ఓవైసీ కుటుంబం ఎంతమేర దోచుకుంద..? ఏటా వస్తున్న ఆదాయం ఎంత..? ఈ ఆదాయాన్ని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారు..? పేదల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారోనన్న పూర్తి వివరాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
రైతుల సంగతేందీ..?
అకాల వర్షాలతో రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతిన్నదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని వారి గురించి పట్టించుకోకుండా సీఎం విదేశాల్లో పర్యటిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కనీసం రాష్ట్ర రైతాంగాన్ని ఆధుకునేందుకు ఆదేశాలైనా ఇవ్వాలని సీఎంను డిమాండ్ చేశారు.