కల్వకుంట్ల కవిత ట్విట్
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్విట్ ద్వారా స్పందించారు. తెలంగాణ సమాజం తలవంచదని తాను చట్టానికి లోబడి దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానన్నారు. 9న ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నాకు నోటీసు పంపింది, అయితే ధర్నాతో పాటు ముందస్తు అపాయింటు మెంట్లు ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటాను అని వెల్లడించారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై జరుపుతున్న పోరాటం విషయంలో సీఎం కేసీఆర్ ను కానీ, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని కవిత స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఏనాటికి తల వంచదని ఢిల్లీలోని అధికార కాంక్షపరులు గుర్తెరగాలన్నారు. ప్రజా హక్కుల కోసం దైర్యంగా పోరాటం చేసి తీరుతామని కవిత స్ఫష్టం చేశారు. అయితే మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న నా డిమాండ్ అని కూడా స్పష్టం చేశారు. రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్న డిమాండ్త తో ఈ నెల 10న నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినప్పటికీ, 9నే ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్గాలు గుర్రుమంటున్నాయి.