ఆస్కార్ అందుకున్న ఐదో బారతీయులు తెలుగోల్లే

సినీ రంగంలో గగనపు అంచులను తాకి చరిత సృష్టించాలంటే ఆస్కార్ అందుకోవడమేనంటుంది సినీ ప్రపంచం. అలాంటి అత్యున్నత పురస్కారానికి కీరవాణి, చంద్రబోసులు ఎంపికై దేశ చరిత్రలో ఐదో సారి అవార్డు అందుకున్న భారతీయులుగా రికార్డు అందుకున్నారు. 95 ఏళ్ల ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఇప్పటి వరకు నాలుసార్లు మాత్రమే అస్కార్ కు ఎంపికయ్యారు ఇండియన్స్.

భారత్ తరుపున తొలి ఆస్కార్‌ అందుకున్న చరిత్ర భాను అథైయాకే దక్కింది. 1983లో 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమా బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగంలో ప్రతిష్టాత్మక అస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఇంగ్లీష్ మూవీకి దర్శకునితో పాటు చాలా మంది ఇంగ్లాండ్‌ కు చెందిన వారే. భానుతోపాటు కొందరు భారతీయులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కాగా ఆమెకు ఈ అవార్డు అందుకుని చరిత్రకెక్కారు. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ మొల్లో, భాను అథైయా సంయుక్తంగా గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా వ్యవహరించి ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు.

ఇకపోతే సీనీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న సత్యజిత్ రేకు అత్యంత అరుదైన పురస్కారం ఆయన చెంతకే వచ్చి చేరింది. ‘పథేర్‌ పాంచాలి’, ‘అపరాజితో’ వంటి వైవిద్యమైన 36 సినిమాలకు దర్శకత్వం వహించారాయన. స్కీన్ర్‌ ప్లే రచయిత, కథారచయిత, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చిత్రకారుడు, కళా దర్శకుడు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో నిష్ణాతులు సత్యజిత్ రే. సినీ రంగానికి సత్యజిత్‌ రే చేసిన విశేష సేవలను గుర్తించిన ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్’ 1992లో గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. అనారోగ్య కారణంగా వేడుకల్లో సత్యజిత్‌రే పాల్గొనలేకపోయారు. దీంతో ఆయన చికిత్స పొందుతున్న కోల్‌కతా ఆస్పత్రిలోనే ఆస్కార్‌ను అకాడమీ అందించింది. ఈ గౌరవ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఆయనే కావడం గమనార్హం.

ఆ తర్వాత 17 ఏళ్లకు 2009లో 81వ ఆస్కార్‌ వేడుకలో రికార్డులు క్రియేట్ చేసింది భారతీయ చలనచిత్ర పరిశ్రమ. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు ఆస్కార్‌ అవార్డులను ముగ్గురు భారతీయులు అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఒకే సినిమాలో ఈ అరుదైన ఘనతను దక్కించుకుని భారత సినీ ప్రంపచం గర్వపడింది. స్లమ్‌డాగ్‌ మిలీనియర్ చిత్రానికి బెస్ట్‌ సౌండింగ్‌ మిక్సింగ్ కేటగిరీలో కేరళకు చెందిన రసూల్, రిచర్డ్‌ ప్రైక్‌, ఇయాన్‌ ట్యాప్‌లు ఆస్కార్‌ పురస్కారం అందుకున్నారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో స్లమ్‌డాగ్‌ మిలియనీర్ చిత్రంలో జయహో పాటకు గేయ రచయిత గుల్జార్, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్‌కు ఆస్కార్‌ వరించింది. బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలోనూ రెహమానే ఆస్కారు అందుకున్నారు. తద్వారా రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా రెహమాన్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. ఢిల్లీకి చెందిన నిర్మాత గునీత్‌ మోన్గా నిర్మించిన పీరియడ్ ఎండ్‌ ఆఫ్‌ ఏ సెంటెన్స్‌ ఉత్తమ డాక్యుమెంటరీగా 2019లో ఆస్కార్‌ గెలుచుకుంది. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమ అందుకున్న అవార్డులు. తాజాగా తెలుగు నాటు నాటు పాట ఎంపిక కావడం దక్షిణాదికే వన్నెతెచ్చినట్టయింది.

You cannot copy content of this page