రాష్ట్రమంతా శునకాలను చూసి జనం జంకుతుంటే ఆ పోలీసు అధికారి మాత్రం ఓ శునకానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదేంటీ తామంతా శునకాలను చూసి జంకుతుంటే ఆయన అలా ఎందుకు వ్యవహరించారని అనుకుంటున్నారా..? అయితే మీరీ ఐటెం చదవాల్సిందే.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ఈ నెల 24 తెల్ల వారు జామున దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించేందుకు పోలీసు అధికారులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో తొలి అడుగులోనే జగిత్యాల పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సర్వీసెస్ కూడా ఈ ఆపరేషన్ లో పోలీసులు ఉపయిగించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పోలీసు జాగిలం రాబిన్ తనదైన స్టైల్లో దోపిడీ దొంగలకు సంబందించిన ఆనవాళ్లను పసిగట్టింది. తనవంతు బాధ్యతగా రాబిన్ కొండగట్టు అంజన్న గర్భాలయంతో పాటు సీతమ్మ బావి తదితర ప్రాంతాల్లో సంచరించి దోపిడీ దొంగల ముఠాకు సంబందించిన ఆనవాళ్లను గుర్తించడంలో సక్సెస్ అయింది. రాబిన్ ఇచ్చిన ఆధారాలను, వేలిముద్రల ద్వారా ఈ ముఠా పాతదేనని గుర్తించిన పోలీసులు చకచకా రంగంలోకి దిగి బీదర్ ప్రాంతంలో ఉన్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకోవడంలో తన వంతు బాధ్యతలను నిర్వర్తించిన జగిత్యాల పోలీసు జాగిలం రాబిన్ కు థాంక్స్ చెప్తూ షేక్ హ్యండ్ ఇచ్చారు ఎస్సీ ఎగ్గిడి భాస్కర్.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post