ఆ కార్పోరేటర్ బీసీ కాదు… కరీంనగర్ కలెక్టర్ ఉత్తర్వులు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పోరేషన్ లో కార్పోరేటర్ కులానికి సంబంధించిన విషయంలో కలెక్టర్ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. కరీంనగర్ బల్దియాకు జరిగిన ఎన్నికల్లోె కోల మాలతి బీసీ సర్టిఫికెట్ పై పోటీ చేశారు. కార్పోరేటర్ గా గెలిచిన మాలతి తాను బీసీ సామాజిక వర్గానికి చెందినట్టుగా తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ తీసుకుని పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈమె బీసీ కాదని సందవేని వినయ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో మాలతి సామాజిక వర్గం ఏంటన్న విషయంపై అప్పటి అధికారులు విచారణ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. అప్పటి కలెక్టర్ శశాంక మాలతి బీసీ కాదని నిర్ధారణ అయిందని ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే కలెక్టర్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై అప్పటి బీసీ మంత్రిత్వ శాఖ స్టే ఇచ్చింది. అయితే వినయ్ స్టే రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయడంతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మాలతి కూడా తన సామాజిక వర్గానికి సంబంధించిన విషయంలో మరో సారి విచారణ చేపట్టాలని దరకాస్తు చేస్తున్నారు. ఈ మేరకు మళ్లీ విచారణ చేపట్టిన అధికారులు మాలతి బీసీ కాదని  తేల్చారు. సంబంధిత అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి proc.no.c4/1129/2020 తేది: 19.01.2024న ఉత్తర్వులు జారీ చేశారు. కోల మాలతికి ఇచ్చిన బీసీగా ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు.  

You cannot copy content of this page