వార్షిక ఆదాయ లక్ష్యం రూ.345 కోట్లు..

డీటీసీ చంద్రశేఖర్ గౌడ్

దిశ దశ, మానకొండూర్:

కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్టు ఆఫీసు పరిధిలో ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 345 కోట్లు నిర్దేశించినట్లు డీటీసీ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరీంనగర్ బృందాన్ని అభినందించారు. రూ. 303 కోట్ల ఆదాయాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో పని చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా నుండి రూ. 169 కోట్లు,
పెద్దపల్లి జిల్లా నుండి రూ. 80కోట్లు, జగిత్యాల జిల్లా నుండి రూ. 58కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రూ. 38 కోట్ల చొప్పున వసూలు చేయాలని లక్ష్యం విధించినట్టు డీటీసీ చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. వాహన దారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధికారులు రంగారావు, శ్యామ్ నాయక్, కొండల్ రావు, ఎంవిఐలు అల్లె శ్రీనివాస్, గౌస్ పాషా, నాగ లక్ష్మి, సిరాజ్, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page