వెలగ పండులో ప్రోటీన్స్ , బీటా కెరోటిన్ , థైమిన్ , ఐరన్ , క్యాల్షియం ఇలా ఎన్నో రకాల రకాల పోషకాలుంటాయి. వాంతులు , విరోచనాలు , జ్వరం , మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఈ పండు మనకు ఏంతో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడడంతో పాటు పొట్టలో ఉండే క్రిములు , నులి పురుగులు కూడా నశిస్తాయి. రక్త హీనత సమస్యను తగ్గించడంలో కూడా ఈ పండు మనకి బాగా సహాయపడుతుంది.
అలాగే ఈ పండు గుజ్జును బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యలతో బాధ పడే వారు తరచూ ఈ పండు జ్యూస్ కూడా మన శరీరానికి చాలా మంచిదట . కాబట్టి ,క్రమం తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. పురుషులు ఈ పండ్లను తీసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. స్త్రీలు వీటిని ఎక్కువుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగ పండు గుజ్జును వారంలో రెండు మూడు సార్లు తీసుకోండి.
ఈ పండు గుజ్జు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెలగ పండులో హైడ్రేటింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి . వీటిలో ఉన్న ఎలక్ట్రోలైట్‌లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది . వీటిలో ఉండే పొటాషియం శరీరం నుంచి చెడు మలినాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.