బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నెగ్గిన అధికార పార్టీ అభ్యర్థి

కొత్తగూడెం ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైకోర్టు

దిశ దశ, ఖమ్మం:

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదంటూ హై కోర్టు తీర్పు వెలువరించింది. గత ఎన్నికలప్పుడు నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు తప్పేనని నిర్దారించింది. దీంతో 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ హై కోర్టు స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వనమా వెంకటేశ్వర్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావును ఓడించారు. దీంతో ఎన్నికలు ముగిసిన తరువాత వనమా వెంకటేశ్వర్ రావు అఫిడవిట్ లో తప్పుడు విషయాలు పేర్కొన్నారంటూ హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు మంగళవారం తుది తీర్పును వెల్లడించి.. వనమా వెకంటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల తరువాత మారిన సమీకరణాల నేపథ్యంలో వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వనామ వెంకటేశ్వర్ రావుపై అధికార టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కోర్టుకు వెల్లడంతో కోర్టు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పునివ్వడం గమనార్హం. దీంతో అధికార పార్టీ అభ్యర్థి అదే పార్టీతో అసోసియేట్ అయిన ఎమ్మెల్యేపై కోర్టులో నెగ్గినట్టయింది.

You cannot copy content of this page