దిశ దశ, భోపాల్:
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుడి కాళ్లు కడిగారు. ఇటీవల అతన్ని ఘోరంగా బీజేపీ నాయకుడు ఒకరు అవమానించిన విషయం తెలుసుకున్న సీఎం కాళ్లు కడిగి ప్రాయచ్ఛిత్తం చేసుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మధ్యప్రదేష్ కు చెందిన ఓ గిరిజనుడిపై అక్కడి బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మూత్రం పోసి అవమాకనకరంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బాధితుడిని తన ఇంటికి పిలిపించుకుని కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పారు. గిరిజనుడిపై తమ పార్టీ కార్యకర్త వ్యవహరించిన విషయంపై ఇప్పటికే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
