రాయికల్ టూ శ్రీలంక… కదులుతున్న డొంక…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా రాయికల్ లింక్ శ్రీలంక వరకు పాకింది. శ్రీలంకలో దొరికిన అనుమానిత వ్యక్తి పాస్ పోర్టు ఆధారంగా ఆరా తీయడంతో రాయికల్ ఏజెంట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తెలంగాణ సీఐడీ క్రైం ఇన్వెస్టిగేషన్ వింగ్ రంగంలోకి దిగడంతో ఒక్కో విషయం బయటకు వస్తోంది. స్థానికేతరులకు పాస్ పోర్టులు ఇప్పించేందుకు రాయికల్ మట్టెవాడకు చెందిన ఏజెంట్ నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసినట్టుగా తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన సీఐడీ అధికారులు స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఓ  ఏఎస్ఐని అరెస్ట్ చేసింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో పనిచేస్తున్న పోస్టల్ అసిస్టెంట్ ఒకరిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. శ్రీలంకలో దొరికిన తీగ ఆధారం చేసుకుని ఆరా తీస్తున్న సీఐడీకి ఎన్నెన్నో కీలక విషయాలు తెలుస్తున్నాయి. నకిలీ అడ్రస్ ప్రూఫ్ లతో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి పాస్ పోర్టులు ఇప్పించేందుకు సదరు ఏజెంటు కీలకంగా పనిచేసినట్టుగా గుర్తించారు సీఐడీ అధికారులు. ఫేక్ అడ్రస్ క్రియేట్ చేసిన వారికి పాస్ పోర్టు చేరే వరకు కూడా ఆ ఏజెంట్ మేనేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. పాస్ పోర్టు దరఖాస్తు నుండి పాస్ పోర్టు చేరే వరకు కూడా ప్రతి విషయంలోనూ ఏజెంట్ కీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. అయితే సీఐడీ అధికారులు ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నకిలీ డాక్యూమెంట్లతో పాసుపోర్టులు తీసుకున్న విషయంతో పాటు మరిన్ని కోణాల్లో కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏజెంట్ ద్వారా ఇలాంటి పాసుపోర్టులు ఇంకా ఏమైనా జారీ అయ్యాయా..? ఫేక్ డాక్యూమెంట్ల వివరాల గురించి కూడా తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జగిత్యాల ప్రాంతంలోనే మరిన్ని పాసుపోర్టుల కోసం ఫేక్ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి ఉంటాడన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నకిలీ పత్రాలను సమర్పించేందుకు సదరు ఏజెంటు ఎవరెవరి సాయం తీసుకున్నాడు..? పాసుపోర్టులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయన్న విషయంపై కూడా తెలుసుకునే ప్రయత్నంలో కూడా అధికారులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులకు కానీ ఇతర దేశాల నుండి దొంగతనంగా భారత్ కు వచ్చిన వారికి కూడా ఇలా పాసుపోర్టులు ఇప్పించాడా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

You cannot copy content of this page