వైరల్ వీడియో…
దిశ దశ, జాతీయం:
పాముకు పాలుపోస్తారా ఎవరైనా అన్న నానుడి మనం సహజంగానే వింటుంటాం. కానీ అక్కడ మాత్రం ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడం కాదు ఏకంగా ప్రాణమే పోశాడు. అపస్మారక స్థితికి చేరుకుని పడి ఉన్న ఓ పామును గమనించిన కానిస్టేబుల్ ప్రాణం పోసిన ఘటన వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వివిధ సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రాణం తీసే పామే అయినా ప్రాణం పోయాలన్న తపనలో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేసిన తీరు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే…మధ్యప్రదేశ్ లోని నర్మదాపురంలో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తే కానిస్టేబుల్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. నర్మాదాపురం పరిసరిల్లో అపస్మారక స్థితిలో పడిఉన్న పామును గమనించిన కానిస్టేబుల్ వెంటనే దానిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని గమనించారు. అంతిమ ఘడియలకు చేరుకున్న ఆ పామును రక్షించాలని సాహసించిన ఆ పోలీసు నీటితో పామును కడిగి ఆ తరువాత తన నోటితో పాము నోటిలోకి శ్వాస పంపించి సీపీఆర్ చేశారు. దీంతో ప్రాణాపాయ స్థితి నుండి పాము సేఫ్ గా బయటపడింది. అయితే సమీపంలోని పురుగుల మందుతో కలుషితం అయిన నీటిని తాగడం వల్లే పాము చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడినట్టుగా తెలుస్తోంది. సకాలంలో కానిస్టేబుల్ పామును కాపాడిన తీరు గమనించిన నెటిజన్లు ఆయనకు ఫిదా అయ్యారు. ఆయన ధైర్యానికి హ్యాట్సాప్ అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా విషపురితమైన పామే అయినా ప్రాణంతో ఉండాల్సిన జీవే కదా అని కానిస్టేబులు చూపించిన సాహసంతో కూడిన చొరవ మాత్రం ఆదర్శప్రాయమనే చెప్పాలి.
https://twitter.com/Anurag_Dwary/status/1717399967239655597?t=uvIjVvvQL9IoPT9ycTcYXQ&s=19