రాజకీయ కోణంలో పెట్టిన కేసు ఇది…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులో కోర్టులో హాజరు పరిచారు. ఆమెను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. అయితే కవిత కూడా తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదుల ద్వారా పిటిషన్ వేశారు. ఇరుదురి వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని కొద్దిసేపు రిజర్వులో ఉంచింది. ఆ తరువాత మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవితను మరో మూడు రోజుల పాటు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఈడీ కస్టడీలోనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కవితను కలిపి విచారించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఫ్యాబ్రికేటెడ్ కేస్ ఇది…

ఫ్యాబ్రికేటెడ్ కేసు అని, రాజకీయ కోణంలో నమోదు చేశారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. శనివారం ఈడీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు వెల్తున్న క్రమంలో మీడియా వారిని ఉధ్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను కోర్టులోనే పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడగుతున్నారని ఈడీపై కవిత కామెంట్ చేశారు.
https://youtube.com/shorts/-bogDTPILnM

You cannot copy content of this page