కోవిడ్ ప్రోటోకాల్ వైపు దేశం

ఎయిర్ పోర్టుల్లో అప్రమత్తం

ఒమిక్రాన్ బిఎఫ్ 7 వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. మన దేశంలో ఈ వేరియంట్ ప్రభావం అంతగా లేకున్నప్పటికీ పలు దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదిలోనే కట్టడి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాంగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ అప్రమత్తత చర్యల్లో భాగంగా అన్ని ఆసుపత్రుల్లో ఈ నెల 27న మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని భావిస్తోంది. అంతేకాకుండా మాస్క్ విధిగా ధరించే విషయంపై కూడా దృష్టి సారించాలని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రీకాషన్ తీసుకుని ప్రజలు జీవించాల్సిన అవసరం ఉందన్న రీతిలో సంకేతాలు ఇస్తోంది.

ఎయిర్ పోర్టుల్లో హై అలెర్ట్

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఒమ్రికాన్ బిఎఫ్ 7 వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పకడ్భందీ చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మరోసారి కోవిడ్ అటాక్ చేసిన దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు RT-PCR టెస్ట్ కంపల్సరీగా చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ప్రధానంగా చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుండి వచ్చే ఇంటర్నేషనల్ టూరిస్ట్ లకు ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ చేయాలని స్ఫష్టం చేసింది. ఇక్కడకు వచ్చే ప్రయాణీకులకు పాజిటివ్ అని తేలితే వారిని విధిగా క్వారంటైన్ కు తరలించాలని కూడా ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియ కూడా మీడియాకు వెల్లడించారు.

‘విశ్వ’ రూపం దాల్చిన వైనం

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో బిఎఫ్ 7 వేరియంట్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కోవిడ్ బాధితుల సంఖ్య ఆయా దేశాల్లో లక్షల్లో నమెదు అవుతుండగా అదే స్థాయిలో మరణ మృదంగం కూడా మోగుతోంది. భారతదేశంలో కొత్త వేరియంట్ లక్షణాలు ఎప్పుడో మొదలైనప్పటికీ దాని ప్రభావం అంతగా లేదని చెప్తున్నప్పటిక స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణలు అంటున్నారు. అలాగే ఇప్పుడు కూడా కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినా అంతగా ప్రభావం చూపడం లేదని స్పష్టం అవుతోంది. అయితే సెకండ్ వేవ్ సమయంలో కూడా అజాగ్రత్తగా వ్యవహరించినందువల్ల భారీ మూల్యం చెల్లించుకున్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నం కావడం మంచింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదయిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ లో 201 కేసులు నమోదు కాగా 183 మంది కోలుకోగా దేశంలో రికవరి రేట్ 98.80 శాతం ఉండగా యాక్టివ్ కేసుల శాతం 0.01 శాతంగా నమోదయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 493,932 కేసులు వెలుగులోకి రాగా, 24 గంటల్లో 1,356 మంది మృత్యువాత పడ్డారు. జపాన్​లో కొత్తగా 173,336 కేసులు నమోదు కాగా 315 మంది ప్రాణాలు చనిపోయారు. బ్రెజిల్​లో 70,415 పాజిటివ్ కేసులు నమోదు కాగా 282 మంది మృతి చెందారు. ఫ్రాన్స్​లో 43,766 కొత్త కేసులు నమోదు కాగా158 మంది మరణించారు.
అమెరికాలో 29,424 కేసులు నమోదు కాగా 135 మంది మృతిచెందారు. దక్షిణ కొరియాలో 68,168 కేసులు నమోదయినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.

You cannot copy content of this page