రూ. 99 లక్షల నగదు… 1988 గ్రాములు బంగారం… 6 కేజీల వెండి: ఏసీబీ దాడుల్లో పట్టివేత

దిశ దశ, కరీంనగర్:

హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో వరసగా రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు మొత్తం 16 చోట్ల ఏసీబీ ఈ దాడులు చేపట్టింది. అదాయానికి మించి ఆస్థులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో చేపట్టిన ఈ సోధాల్లో భారీగా నగదు. నగలు, ఆస్థులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

సీజ్ చేసినవి ఇవే…

శివ బాల కృష్ణ నుండి రూ. 99, 60, 850 నగదు, 1988 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. స్థిర, చరాస్థులకు సంబంధించిన డాక్యూమెంట్లు కూడా సీజ్ చేశారు. రూ. 5,96,37,495ల విలువ చేస్తే స్థిర చరాస్థుల పత్రాలు లభ్యం అయినట్టుగా అధికారులు వెల్లడించారు. మొత్తం రూ. కోట్ల 26 లక్షల, 48,999ల ఆస్థులు, నగదు, ఆభరాణాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అయితే ఆయా ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం ప్రకటించిన వాల్యూ ప్రకరమేనని, బహిరంగ మార్కెట్ లో చాలా రెట్లు ఎక్కువ ధర పలుకుతుందని అధికారులు వివరించారు. శివ బాల కృష్ణపై 13(1) (B), 13 (2), అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. 

You cannot copy content of this page