ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు… వివేక్ ఇంట సోదాలపై ఈడీ

దిశ దశ, మంచిర్యాల:

చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానందకు సంబంధించిన సంస్థలు, ఇండ్లలో  దాడులు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆయన పరోక్ష భాగస్వామ్యంతో నడుస్తున్న సంస్థ లావాదేవీలను పరిశీలించినప్పుడు ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా వెల్లడైనట్టు ఈడీ తెలిపింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు ‘ఎక్స్’ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. 21వ తేదిన తెలంగాణలోని నాలుగు చోట్ల ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ ముంట్ యాక్ట్ (ఫెమా) 1999 నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గడ్డం వివేకానంద ఇంటితో పాటు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు, మంచిర్యాలలోని ఆయన తాత్కాలిక నివాసంలో ఏక కాలంలో ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణ పోలీసుల సూచన మేరకు తాము దర్యాప్తు చేశామని వివరించిన అధికారులు.. రూ. 8 కోట్లు డాక్టర్ జి వివేక్ బ్యాంక్ ఖాతా నుండి విజిలెన్స్ సెక్యూరిటీకి హేతుబద్దత లేకుండా బదిలీ చేశారని తెలిపారు. వివేకానంద దంపతుల సంస్థ అయిన విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీకు రూ. 20 లక్షలు బ్యాలెన్స్ షీట్ లో రాబడిగా చూపించారు కానీ కంపెనీ బ్యాంక్ ఖాతా క్రెడిట్, డెబిట్ లావాదేవీల కంటే ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ వివేక్ పరోక్ష నియంత్రణలో ఉన్నట్టుగా కూడా తమ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపారు. సదరు సంస్థ ద్వారా ఫెమా ఉల్లంఘటనలు కూడా జరిగాయిని, వివేక్ ద్వారా ఒక సంస్థను విలీని చేయడంతో ప్రాథమికంగా ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టుగా గుర్తించినట్టు వెల్లడించారు. తమ సోదాల్లో డిజిటల్ పరికారల్లో లభించిన ఆధారాలను బట్టి రూ. కోట్లలో అనుమానస్పదంగా, లెక్కల్లోకి రాని లావాదేవీలను సూచించే పత్రాలను, ఆస్తలకు సంబంధించిన ఒప్పందాలలో లెక్కల్లోకి రాని లావాదేవీలు జరిగినట్టుగా తేలిందని ఈడీ అధికారులు వివరించారు. అలాగే వివేక్ అన్న గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి పలు డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్ ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు సంస్థ ఎండీ సత్యనారాయణ నివాస ప్రాంగణంలో జరిపిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ పరికారాలను, రూ. 10.39 లక్షలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

You cannot copy content of this page