గాడుపు దుమారం ఎఫెక్ట్… భట్టి క్యాంప్ లో ఇబ్బందులు

దిశ దశ, జమ్మికుంట:

గురువారం అర్థరాత్రి తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క్యాంప్ లో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హఠాత్తుగా ప్రకృతిలో వచ్చిన మార్పులతో గాడుపు దుమారం తీవ్రతరం కావడంతో కాంగ్రెస్ నాయకులు అవస్థలు పడ్డారు. ఆయనతో పాటు పాదయాత్రలో నడిసొచ్చే వారు క్యాంపులో షెల్టర్ తీసుకోలేకపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద ఏర్పాటు చేసిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయత్ర క్యాంపు కోసం వేసిన టెంట్లు అర్థరాత్రి కుప్ప కూలిపోయాయి. కొన్ని గాలికి కొట్టుకపోయాయి. దీంతో భట్టి క్యాంపు సమీపంలోని బస్సులోకి వెల్లి రెస్ట్ తీసుకున్నారు. అయితే ఆయన వెంట నడిసొచ్చిన కార్యకర్తలు, నాయకులకు షెల్టర్ లేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొద్దిసేపటి తరువాత వాతావరణం శాంతించిన తరువాత పార్టీ శ్రేణులు ఓపెన్ ప్లేస్ లోనే సెద తీరారు.

అర్థరాత్రి తనుగుల క్యాంపు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

You cannot copy content of this page