సీనియర్ హీరోయిన్ శ్రీయ గతంలో ఫంక్షన్, పార్టీలలో తన భర్తను ముద్దులతో ముంచెత్తించింది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఓ షోలో భర్తను శ్రియ ముద్దులతో తడిపేసింది. అందరిముందే భర్తకు లిప్ కిస్‌లు ఇస్తూ రెచ్చిపోయింది. ఈ ఫొటోలు నెట్టింట ఇప్పుడు హల్చల్ సృష్టిస్తున్నాయి.
తాజాగా ఒక ప్రముఖ తెలుగు టెలివిజన్ షోలో తన భర్త ఆండ్రీతో కలిసి శ్రియ పాల్గొంది. ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరించిన ఈ షోలో భర్తతో కలిసి శ్రియ హల్ చల్ చేసింది. స్టేజ్ పైకి రాగానే భర్తకు లిప్ కిస్ లు ఇచ్చింది. దీంతో షోలో ఉన్నవారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ లిప్ కిస్‌తో షో రేటింగ్స్ తారాస్థాయికి చేరకునే అవకాశముందని బుల్లితెర వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్న శ్రియ.. చాలా రోజుల తర్వాత తెలుగు బుల్లితెరపై ప్రత్యక్షమవ్వడం, అది కూడా భర్తతో కలిసి రావడంతో ఆసక్తికరంగా మారింది.తెలుగు టెలివిజన్ షోలో ఇప్పటివరకు ఎవరు ఇలా లిప్ కిస్ ఇవ్వలేదు. ఒక హీరోయిన్ తొలిసారి భర్తకు షోలోనే లిప్ కిస్ ఇవ్వడంతో ఇది వైరల్ గా మారింది.
కానీ గతంలోనూ ఇలా పలు ఫంక్షన్లలలో భర్తకు ఓపెన్ గా శ్రియ ముద్దులు ఇవ్వడంతో.. ఇదేమి కొత్త కాదు కదా అని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శ్రియ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయాలని ఈ బ్యూటీ భావిస్తోంది. అత్తగా, అమ్మగా కూడా నటించేందుకు రెడీ అవుతోంది. ఈ తరుణంలో తెలుగు షాలో పాల్గొని సందడి చేసింది. చాలా రోజుల తర్వాత శ్రియ స్క్రీన్‌పై కనిపించడంతో.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.త్వరలో సిల్వర్ స్క్రీన్‌పైకి శ్రియ రీఎంట్రీ వార్తలతో అభిమానులు ఆనందపడుతున్నారు.