ఉన్న భూములు నీళ్ల పాలు…

మేమెందుకు బ్రతకాలి సారూ..?

బాధిత రైతుల జలదీక్ష

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి:

మా వ్యవసాయ భూములన్ని నీళ్ల పాలయ్యాయి. సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేమెందుకు బ్రతకాలి సారూ…? అంటూ ఆ రైతులు అధికారులను నిలదీస్తున్నారు. చెరువు కోసం భూమిని తీసుకున్నా మా బ్రతుకుదెరువు కోసం చూడారా అంటూ అక్కడి రైతులు వినూత్న నిసనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామ రైతులు తమ భూములకు ముంపునకు గురైన చెరువులోనే జల దీక్ష చేపట్టారు. 80 కుటుంబాలకు చెందిన సుమారు 200 ఎకరాల భూమి చెరువు నీటిని నిలువ ఉంచేందుకు సేకరించిన అధికారులు తమకు మాత్రం ఎలాంటి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని పరిహారం ఇప్పించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page