ముఖాముఖి విచారణ మరో మూడు గంటలే…

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, రామచంద్ర పిళ్లైల ముఖాముఖి విచారణకు మరో మూడు గంటలు మాత్రమే మిగిలింది. ఈ రోజు మద్యాహ్నం 3 గంటల వరకు కోర్టు ఈడీ కస్టీడీకి అనుమతించింది. మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కవిత, పిళ్లైల ముఖాముఖి విచారణకు కేవలం మూడు గంటలు మాత్రమే మిగిలింది. మూడు గంటల్లో కవిత, పిళ్లైలను వివిధ కోణాల్లో ఈడీ ఇంటరాగేషన్ టీం ప్రశ్నించనుంది. అయితే వీరిద్దరిని ప్రశ్నించిన నేపథ్యంలో ఈడీకి క్లారిటీ రానట్టయితే మళ్లీ పిళ్లైని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తిని కస్టడికీ ఇచ్చేందుకు 14 రోజుల కన్న ఎక్కువ ఇవ్వరాదన్న నిభందనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చట్టాలు ఏం చెప్తున్నాయో కూడా పరిశీలించనున్నారు. దీంతో కోర్టు తీసుకునే నిర్ణయంపైనే పిళ్లై కస్టడి పొడగింపు ఉంటుంది. లేనట్టయితే ప్రత్యామ్నాయంగా ఈడీ అధికారుల విచారణకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా విచారించేందుకు కూడా ముందుకు వెల్లనున్నారు.

You cannot copy content of this page