టెలిగ్రాఫ్ యాక్ట్… దేశంలోనే ఫస్ట్ కేస్…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. టెలిగ్రాఫ్ యాక్టును కూడా జోడిస్తూ కోర్టులో మెమో అందించారు. టెలిగ్రాఫ్ యాక్ట్ అమలు చేయడం అనేది దేశంలోనే ఇదే మొదటి కేసుగా నిపుణులు చెప్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయం కేంద్రీకృతంగా చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ అమలు చేయడం అనేది కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే టెలిగ్రాఫ్ యాక్టు అమలు చేస్తారన్న ఉహాగానాలు వచ్చినప్పటికీ కీలకైన ఆదారాలు లభ్యం కాకపోవడంతో పోలీసు అధికారులు ఇన్ని రోజులు ఈ అంశాన్ని హోల్డ్ లో ఉంచారు. తాజాగా టోలిగ్రాఫ్ యాక్టును కూడా జోడిస్తూ మెమో ఇవ్వడంతో పోలీసుల చేతికి ముఖ్యమైన ఆధారం చిక్కినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ కేసులో ఎస్ఐబీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన కైతోజు కృష్ణను ప్రత్యక్ష్య సాక్షిగా దర్యాప్తు అధికారులు చూపించారు. డిసెంబర్ 4న ఎస్ఐబీ కార్యాలయంలోని వార్ రూమ్ తో పాటు లాగర్ రూమ్ పవర్ సప్లైని కృష్ణ ద్వారానే నిలిపివేయించిన ప్రణిత్ రావు సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని పోలీసు అధికారులు గుర్తించారు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ కృష్ణ వాంగ్మూలాన్ని తీసుకున్న దర్యాప్తు అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రధాన సాక్షి అయిన కృష్ణ స్టేట్ మెంట్ ను కోర్టులో కూడా నమోదు చేయించే ఆలోచనలో దర్యాప్తు అధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టయితే సాక్ష్యాధారాలను పకడ్భందీగా ఉంటాయన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

పర్మిషన్ ఎవరిచ్చారు..?

ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించే లాగర్ రూంలోకి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి కంపల్సరీ అని తెలుస్తోంది. ఇంటలీజెన్స్ చీఫ్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవల్సి ఉంటుందని, సదరు అధికారి అందుబాటులో లేనట్టయితే డీజీపీ అనుమతితోనే అందులోకి వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ లాగర్ రూమ్ లోకి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను ఎలా చక్కబెట్టారన్నదే పజిల్ గా మారిపోయింది. దీనిని ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చిన అదికారి ఎవరూ..? అన్న వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కీలకమైన మరికొన్ని అంశాలను కూడా సునిశితంగా ఆరా తీసి అవసరమైన ఆధారాలను క్రోడీకరించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

ఓఎస్డీలు ఏం చేశారు..?

అంతేకాకుండా ఈ కేసులో ఓఎస్డీలుగా వ్యవహరించిన అధికారులు ఏం చేశారు అన్న విషయంపై కూడా పోలీసు అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీలు)గా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది వరకు ఈ విభాగంలో పని చేశారని వీరంతా కూడా రిటైర్డ్ అధికారులేనని గుర్తించారు. నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఈ స్థాయిలో అదికారులను ఎస్ఐబీకి డిప్యూట్ చేసుకోలేదన్న విషయాన్ని గమనించిన అధికారులు అసలేం జరిగి ఉంటుంది అన్న కోణంలో ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఓఎస్డీలుగా వ్యవహరించిన పోలీసు అధికారులను కూడా పిలిపించి విచారించడంతో పాటు లాగర్ రూం ఓపెన్ చేయడానికి అసలు కారణాలు ఏంటీ..? ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చిన అదికారులు ఎవరో కూడా తెలుసుకోనున్నట్టు సమాచారం.

రాధాకిషన్ అరెస్ట్…

ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ ను శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించాలని న్యామూర్తి ఆదేశించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావులను కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు రాత్రి 8 గంటల తరువాత విచారణ చేయకూడదని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

You cannot copy content of this page