నక్క జిత్తులు పనిచేయలే… ఆహారం కోసం వచ్చి బావిలో పడి…

దిశ దశ, జగిత్యాల:

వన్య ప్రాణుల్లో స్పెషలిస్టుగా పేరోందిన ఆ జీవులు కష్టాల్లో చిక్కుకున్నాయి. జిత్తుల మారి తెలివి తేటలతో వనాల్లో తిరుగాడే జంతువులను ముప్పు తిప్పలు పెట్టే నక్కలు ఆపదలో చిక్కుకున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు జిత్తుల మారి నక్కలను కాపాడారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపల్లి గ్రామాల శివారులోని వ్యవసాయ బావిలో పడ్డాయి నక్కలు. తొర్తి గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో శుక్రవారం సాయత్రం రెండు నక్కలు పడిపోయాయి. ఆహారం కోసం వ్యవసాయ భూముల్లోకి వచ్చిన నక్కలు వ్యవసాయ బావిలో పడిపోయాయి. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన యంత్రాంగం అక్కడకు చేరుకుని వాటిని కాపాడింది. పారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎండీ ముషీర్ అహ్మద్ సిద్దిఖ్, బీట్ ఆఫీసర్ మధుసూధన్, వాచర్లు స్థానికుల సహారంతో వ్యవసాయ బావిలో పడ్డ నక్కలను వలల సహాయంతో బయటకు తీసి కాపాడారు. శుక్రవారం సాయంత్రం రెస్క్యూ చేస్తున్న క్రమంలో చీకటి పడడంతో శనివారం ఉదయం తిరిగి వ్యవసాయ బావి వద్దకు చేరుకున్న అటవీ అధికారుల బృందం వాటిని సేఫ్ గా బయటకు తీయడంలో సక్సెస్ అయ్యారు.

You cannot copy content of this page