ఐఏఎస్ ల బదిలీలు… ఉత్తర్వులు జారీ…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీఓఆర్టీ నంబర్ 840ని విడుదల చేసింది ప్రభుత్వం. పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను ఖమ్మం  జిల్లాకు, మంచిర్యాల కలెక్టర్ బదాత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లాకు, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ గా పని చేస్తున్న సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లాకు, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నిర్మల్ కలెక్టర్ అశిష్ సంగ్వాన్ కామారెడ్డికి, జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా, వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ గా ఉన్న రాహుల్ శర్మ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా, హన్మకొండ కలెక్టర్ గా ఉన్న సిక్త పట్నాయక్ నారాయణపేట కలెక్టర్ గా, పెద్దపల్లి కలెక్టర్ గా కొయ శ్రీ హర్ష, వరంగల్ కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రావిణ్యను హన్మకొండ కలెక్టర్ గా, ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్న బుడ్మాజీ సత్యప్రసాద్ జగిత్యాల కలెక్టర్ గా, మహబూబ్ నగర్ కలెక్టర్ గా బి  టీ ఆర్ అండ్ బిలో స్పెషల్ సెక్రటరీగా పని చేస్తున్న విజయేంద్రను, నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్ గా, భద్రాచలం ఐటీడీఏ పీఓగా ఉన్న ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్ర్ గా, నల్గొండ కలెక్టర్ గా నారాయణరెడ్డి, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆదర్శ్ సురభి వనపర్తి కలెక్టర్ గా, సూర్యపేట కలెక్టర్ గా తేజస్ నందల్ పవార్, వ్యవసాయ, సహకార శాఖల జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న ఎం సత్య శారద దేవి వరంగల్ కలెక్టర్ గా, జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్న దివాకరను ములుగు జిల్లా కలెక్టర్ గా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా పని చేస్తున్న అభిలాష అభినవ్ నిర్మల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. 

You cannot copy content of this page