పాత మంచం ఇచ్చారని పెళ్లికి రాని వరుడు!

ఇటీవలి కాలంలో వధువు లేదా వరుడి ప్రేమ వ్యవహారం బయటపడడం, అదనపు వరకట్నం కోసం వధువు తరుపు వారిని బలవంతపెట్టడం, ఇరు కుటుంబాల మధ్య గొడవ పడడం వంటి కారణాలతో పలు పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇలా చిన్న చిన్న కారణాలతో పలు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మొన్నామధ్య పెళ్లికి మాంసాహారం పెట్టలేదనే కారణంతో ఓ పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. తాజాగా తన పాత మంచం ఇచ్చారని పెళ్లికొడుకు నిఖాకు నిరాకరించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడలో మౌలాలి అనే వ్యక్తి ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మౌలాలికి పాతబస్తీకి చెందిన మహమ్మద్‌ జకారియాతో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఈ నెల 13న వధువు ఇంటి దగ్గర ఘనంగా నిశ్చితార్థం చేశారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మసీదులో పెళ్లి కావాల్సి ఉంది. వారి సాంప్రదాయం ప్రకారం.. శనివారం సాయంత్రమే పెట్టుపోతలు కార్యక్రమం నిర్వహించారు.

వరుడి ఇంటికి మంచం, ఇతర ఫర్నీచర్‌ పంపారు. అయితే మంచం విడి భాగాలు జోడిస్తుండగా అది విరిగిపోయింది. దీంతో పాత మంచానికి రంగులు వేసి తనకు పంపించారని భావించిన పెళ్లికుమారుడు.. నిఖా సమయానికి రాలేదు. దీంతో వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లగా.. ‘పెళ్లికి ముందు మట్లాడుకన్న ప్రకారం కట్నకానుకలు పంపలేదు. పాత మంచం ఎందుకు ఇచ్చావంటూ గొడవపడ్డాడు’. ఇందుకు వరుడి తల్లి కూడా వంతు పాడింది.

చివరకు తాను ఈ పెళ్లి చేసుకోనని మౌలాలి తెగేసి చెప్పాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్సై మాట్లాడగా వరుడు పెళ్లికి అంగీకరించాడు. అయితే ఇక్కడే వధువు తండ్రి అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. ఈ పెళ్లికి వరుడు ఒప్పుకున్నా.. తాను ఒప్పుకోనని మ్యారేజ్​ క్యాన్సిల్​ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

You cannot copy content of this page