దిశ దశ, హైదరాబాద్:
కరీంనగర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు కమిషన్ అపాయింట్ చేసింది. సోమవారం విచారించిన హై కోర్టు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజను కమిషన్ గా అపాయింట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 11 నుండి 17వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలన్న హైకోర్టు మరుసటి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఎన్నికల అఫడవిట్ లో మంత్రి గంగుల కమలాకర్ తన పేరిట ఆస్థులు ఉన్నా చూపించలేదని, అలాగే ఎన్నికల్లో ఆయన ఎన్నికల కమిషన్ పరిమితికి మించి ఖర్చు చేశారంటూ బండి సంజయ్ తరుపున న్యాయవాది నలుమాచు హరిప్రసాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిిటిషన్ ను విచారించిన హై కోర్టు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశించింది.
Disha Dasha
1884 posts
Prev Post