మద్యంతర పిటిషన్ కొట్టివేత
దిశ దశ, హైదరాబాద్:
తాజాగా మరో రాష్ట్ర మంత్రికి కూడా హై కోర్టులో నిరాశే ఎదురైంది. తన ఎన్నికపై వేసిన పిటిషన్ కొట్టివేయాలని చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ కొట్టివేయాలని మంత్రి కొప్పుల కొప్పుల ఈశ్వర్ చేసుకున్న అభ్యర్థనను హై కోర్టు తోసిపుచ్చింది. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్ ను కొట్టివేసిన మూడేళ్ల పాటు విచారణ జరిగడంతో పాటు అడ్వకేట్ కమిషన్ వద్ద వాదనలు ముగిశాక ఇప్పుడు పిటిషన్ ను కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. తుది వాదనలు వినాల్సి ఉందని కూడా స్పష్టం చేయడం గమనార్హం. కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమర్ హై కోర్టును ఆశ్రయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని హై కోర్టుకు లక్ష్మణ్ కుమార్ విన్నవించడంతో గతంలోనే రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించింది. అయితే స్ట్రాంగ్ రూం తాళం చేతులు మిస్ కావడంతో వాటిని పగల గొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ హై కోర్టు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత ఎన్నికల కమిషన్ కూడా విచారణ జరపాలని హై కోర్టు ఆదేశించడంతో ఈసీఐకి చెందిన ప్రత్యేక అధికారుల బృందం జగిత్యాల స్ట్రాంగ్ రూం వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను హై కోర్టుకు కూడా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో అడ్వకేట్ కమిషన్ ను అపాయింట్ చేయగా విచారణ కూడా జరుగుతోంది. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ పిటిషన్ ను కొట్టివేయాలని మంత్రి కొప్పుల హై కోర్టును ఆశ్రయించడంతో ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మంత్రి కొప్పులకు కూడా ఈ విషయంలో ఆశాభంగం ఏర్పడినట్టయింది.