అక్కడ సీన్ రీకన్సట్రక్షన్… ఇక్కడ డైరీ స్వాధీనం…

డీఎస్పీ ప్రణిత్ రావు రెండో రోజు కస్టడీ తీరు…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్, సాక్ష్యాల తారుమారు కేసులో పోలీసు కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణిత్ రావు నుండి కూపీలాగే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసు అధికారులు. రెండో రోజు కస్టడీలో ప్రణిత్ రావు నుండి కేసు పూర్వాపరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ విచారణలో పలు కోణాల్లో ఆయన్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రణిత్ రావును విచారించిన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఠాణా గేట్లు మూసి ఎవరిని కూడా లోపలకు అనుమతించలేదు. ఇప్పటికే ప్రణిత్ రావు నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల రిట్రైవ్ చేసిన పోలీసు అధికారులు అందులో లభ్యమైన సమాచారం ఆధారంగా ఆయనపై ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. మరో వైపున ఎస్ఐబీ కార్యాలయానికి తీసుకెళ్లి దర్యాప్తు బృందం సీన్ రీ కన్సట్రక్షన్ చేసింది. ఎస్ఐబీ ఆఫీసులోని ఎస్ఓటీ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక గదుల్లోని ఉన్న 47 హార్డ్ డిస్కులను మార్చి వాటి ప్లేసులో కొత్తవి ఏర్పాటు చేసినట్టుగా ప్రణిత్ రావు ఒప్పుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. మరో వైపున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెల్లిన మరో పోలీసు బృందం ఆయన ఇంటి నుండి డైరీని స్వాధీనం చేసుకుంది.

కన్ఫెస్ అయ్యాడా..?

అయితే రెండో రోజు దర్యాప్తు బృందం ప్రణిత్ రావు నుండి మరింత సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ పార్టీ నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశామని దర్యాప్తు బృందం ముందు ఒప్పుకున్నట్టుగా తెలిసింది. ఏఏ పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు..? ఎం మంది ఫోన్లను ట్యాపింగ్ జాబితాలో చేర్చారు అన్న వివరాలు కూడా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రణిత్ రావు కన్ఫెషన్ ఆధారంగా పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా సమాచారం. అలాగే స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా వార్ రూమ్స్ ఏర్పాటు చేసింది నిజమేనని కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ వార్ రూములు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఇందు కోసం సహరించిన పోలీసు అధికారులు ఎవరు..? ప్రైవేటు వ్యక్తులు ఎవరూ అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page