ట్రాకింగ్ TO ట్యాపింగ్..?

మెలుకువలు నేర్పిన ఉప ఎన్నికలు

విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో వరుసగా జరిగిన ఉప ఎన్నికలే వారిని తీర్చిదిద్దాయా..? ఉప ఎన్నికల్లో డేగ కళ్లతో నిఘాను కట్టదిట్టం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ట్రాకింగ్ విధానం చివరకు ట్యాపింగ్ కు వరకూ చేరిందా..? ఒక్కో ఉప ఎన్నికల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సాధారణ ఎన్నికల నాటికి సాంకేతికతపై పూర్తి పట్టు సాధించారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది పోలీసుల విచారణలో. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం చేసిన అత్యుత్సాహం ఇంత దూరం తీసుకొచ్చిందా అన్న చర్చ కూడా పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది.

హుజురాబాద్ నుండి స్టార్ట్..!

2021లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల తంతు నుండి అసలు వ్యవహారం ప్రారంభం అయినట్టుగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అంతరం పెరగడంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు చోటు చేసుకున్నాయి. హుజురాబాద్ లో ఈటలపై పట్టు బిగించాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. తన ప్రభావాన్ని చూపించి హుజురాబాద్ లో ఈటల ఓటమి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కేసీఆర్. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ వెంట నడిచి వెల్లేవారి వివరాలు సేకరించడం, ఆయన ప్రచారస్త్రాలను నిలువరించడం కోసం మొదట ట్రాకింగ్ చేసే విధానం మొదలు పెట్టినట్టుగా విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తోంది. ట్రాకింగ్ చేస్తూ ఈటలకు అండగా ఉన్న నాయకులను సొంత పార్టీలోనే ఉండే విధంగా మచ్చిక చేసుకోవడం, రాజేందర్ వ్యవహారాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన వారిని ఎక్కడికక్కడ పట్టుకోవడం కోసం ఆయా మొబైల్ నంబర్లను ట్రాక్ చేయడం ఆరంభించారు. అయితే మొబైల్ ట్రాక్ చేసేందుకు సంబంధిత పోలీసు అధికారుల భాగస్వామ్యం కూడా అవసరమని హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకూలమైన పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ పోస్టింగులో ఉండాలని భావించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఈ సమస్యను మరింత అధిగమించి ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించే వ్యూహాలకు పదును పెట్టినట్టుగా పోలీసు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. ఒక్కో ఉప ఎన్నికలో ఎదైరన అనుభావాలను రంగరించి జనరల్ ఎలక్షన్స్ నాటికి పరిపూర్ణమైన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నారని నిర్దారించినట్టుగా తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా…

ట్రాకింగ్ తో పాటు సీడీఆర్ వివరాలు తీసుకునేందుకు ఏసీపీ నుండి ఎస్ఐల సహకారం అవసరమని భావించిన స్పెషల్ టీమ్స్ అందుకు అనుగుణంగా అప్ డేట్ అవుతూ ముందుకు సాగింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తమదే పై చేయి కావాలన్న లక్ష్యంతో ఉన్న పోలీసు విభాగంలోని ఓ వర్గం అంతా కూడా ఇందుకు అనుగుణంగా కసరత్తులు చేయడం ఆరంభించింది. ఇందులో భాగంగానే ఎస్ఐబీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్ఓటీకి స్పెషల్ ఆఫీసు, 17 కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం బ్రాడ్ బాండ్ కనెక్షన్ కూడా బీఎస్ఎన్ఎల్ కాకుండా ప్రైవేటు కంపెనీలకు చెందిన వాటిని తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయితే నిభందనల ప్రకారం నడుచుకుంటుందని, తమకు అవసరమైన విధంగా అయితే ప్రైవేటు కంపెనీలను మల్చుకునే అవకాశం ఉంటుందన్న యోచనతోనే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే తరుచూ టెలికాం సర్వీసుల నుండి ట్యాపింగ్ కు సంబంధించిన లింక్ తెప్పించుకోవడం ఇబ్బందిగా మారిందని కూడా భావించి స్పెషల్ టీమ్స్ అప్ డేట్ వర్షన్ సాఫ్ట్ వేర్ ఉంటుందని భావించినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలో కీలక వ్యక్తం ఒకరు విదేశాలకు వెల్లినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తించి దానిని ఇక్కడి స్పెషల్ టీమ్ కు అందజేస్తారు. ఎన్నికలకు నాలుగు నుండి 2 నెలల ముందు వరకూ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడంతో ప్రతిపక్ష పార్టీల గుట్టు తమ చేతుల్లోకి వచ్చిన తరువాత తమ టార్గెట్ సులువు అవుతుందని అంచాన వేసుకున్నారని, అన్ని తమ చేతుల్లో ఉన్నప్పుడు గెలుపు ఎందుకు సాధ్యం కాదో చూద్దామని అనుకుని పాత అభ్యర్థులకే టికెట్లు కెటాయించినట్టుగా గుర్తించారు. వారిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రతిపక్షాలను బలహీనపర్చే మాస్టర్ ప్లాన్ తమవద్ద ఉన్న తరువాత అంతా అనుకూలంగానే సాగుతుందని అంచనా వేసినప్పటికీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఫలితాలు తారుమారు అయ్యాయి. అయితే ఈ వ్యవహారం అంతా కూడా స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దల మధ్య మాత్రమే కన్వర్జేషన్ నడుస్తుండేదని పోలీసు అధికారుల విచారణలో తేలినట్టుగా సమాచారం.

You cannot copy content of this page