దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు మరోసారి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అటవీ ప్రాంతాల్లో మరో వాహనాన్ని దగ్దం చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… చత్తస్ గడ్ లోని నారాయణపూర్ జిల్లా కాప్సీ అటవీ ప్రాంతం మీదుగా ఇనుప ఖనిజం తరలిస్తున్న ఓ లారిని దగ్దం చేశారు. రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి వేసి లారీని ఆపి నిప్పటించారు. ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద తరలింపును చాలా కాలంగా మావోయిస్టులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐరన్ తరలిస్తున్న ఈ లారీని దగ్దం చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.
