నాడు సీఎస్ నేడు కలెక్టర్… ఉన్నతాధికారులే టార్గెట్..?

దిశ దశ, వరంగల్:

సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తున్న తీరు తలనొప్పిగా మారిపోయింది. సామాన్యులే కాదు… అసామన్య స్థాయిలో ఉన్న వారి పేరిట కూడా మోసాలకు పాల్పడడానికి వెనకాడడం లేదు. ఇప్పటి వరకు డెబిట్ (ఏటీఎం), డెబిట్ కార్డుల బ్లాక్ అయ్యాయంటూ ఫోన్ కాల్స్ చేసే ముఠాలు కొన్ని అయితే… సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా డబ్బులు గుంజుతున్నాయి మరికొన్ని ముఠాలు. అయితే సైబర్ క్రిమినల్స్ బెడద సామాన్యులకు మాత్రమే కాదు… ఉన్నతాధికారులకూ తప్పడం లేదు.   గతంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతీ కుమారి ఫోటో అప్ లోడ్ చేసిన క్రిమినల్స్ పలువురికి ఫోన్లు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న సీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరిట ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన అగంతకులు డబ్బులు కావాలంటూ మెసెజ్ చేయడం మొదలు పెట్టారు. +94776414080 నెంబర్ నుండి మెసెజ్ చేసిన ఈ క్రిమినల్ శ్రీలంక దేశం నుండి డబ్బుల వసూళ్లకు పాల్పుడుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ప్రావీణ్య అలెర్ట్ అయ్యారు. తన పేరిట ఎవరు మెసేజ్ చేసినా కాల్స్ చేసినా స్పందించవద్దని కోరారు. చీటింగ్ గ్యాంగ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అలాంటి నెంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ప్రావీణ్య.

You cannot copy content of this page