బలగం మూవీలో మిస్సయిన సీన్…

మరణించిన వారి సంతృప్తి కోసం…

జమ్మికుంటలో వింత పద్దతి

దిశ దశ, జమ్మికుంట:

బలగం సినిమాలో చనిపోయిన కొమురయ్యను సంతృప్తి పర్చేందుకు కుటుంబ సభ్యులు పడ్డ కష్లం అంతా ఇంత కాదు. మనిషి చనిపోయిన తరువాత కాకి రూపంలో వచ్చి తాము తయారు చేసిన వంటకాలను తింటే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందన్న నమ్మకం అనాదిగా వస్తోంది. ఇందు కోసం బలగం సినిమాలో ఊరందరికి బావ బామ్మర్దులు పోటీ పడి భోజనాలు ఏర్పాటు చేసిన వంటకాలను మాత్రం పక్షి ముట్టలేదు. దీంతో తామేం తప్పు చేశామోనని కలవరపడిపోయిన బలగం కొమురయ్య వారసులు గాలిలో కలిసిపోయిన ఆయన్ని సంతృప్తి పరచడమేలా అని మల్లగుల్లాలు పడుతుంటారు. ఈ విషయంపై బావ బామ్మర్దులిద్దరూ వాదోపవాదోలాకు దిగిగా గ్రామస్థులు కూడా కొమురయ్య కోసం పెట్టిన వంటకాలు తినకపోతే శిక్ష తప్పదంటూ హెచ్చరికలు కూడా చేస్తారు. దీంతో చివరి రోజైన కొమురయ్య పక్షి రూపంలో వచ్చి తింటాడా లేదా అన్న వేదనలో ఆ కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతూ… ఆనవాయితీ ప్రకారం వంటకాలు పెట్టి పక్షి రాకకోసం ఎదరు చూస్తుంటారు. ఎంతకీ పక్షి రాకపోవడంతో ఓ పాట కూడా పాడుతుండగా అందరూ ఒక్కటై కలిసిపోవడం… చివరకు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో కాకి వచ్చి వంటకాలను ఆహారంగా తీసుకోవడంతో కొమురయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకుంటారు. తెలంగాణలో తరతరాలుగా నడుస్తున్న ఈ ఆచారాన్ని వెండితెరపైకి వేణు ఎక్కించగా కొంతమంది విమర్శలు చేయగా తెలంగాణ ప్రాంత వాసులు మాత్రం యదార్థానికి అద్దం పట్టినట్టుగా తీశారంటూ సినిమా యూనిట్ ను అభినందనల్లో ముంచెత్తారు. సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటి తెలంగాణలో రిపిట్ అయింది కాస్తా డిఫరెంట్ గా అనిపించిన ఈ కథనం వింటే ఔరా అనక మారరు.

ఏం జరిగిందంటే..?

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ శివార్లలో చోటు చేసుకున్న ఈ ఘటన బలగం సీనిమా తీసిన తీరును మించిపోయిందని చెప్పవచ్చు. గ్రామానికి చెందిన ఓ వృద్దుడు మూడు రోజుల క్రితం మృత్యువాత పడగా మూడో రోజు ఆయనకు నచ్చిన వివిధ రకాల వంటకాలను తీసుకొచ్చి ఉంచారు. పిట్ట అటు వైపు వచ్చి వంటకాలను ముట్టకపోవడంతో కలత చెందారు ఆయన కుటుంబ సభ్యులు. ఐదో రోజు అయినా వంటకాలను పిట్ట ముట్టాలంటే ఏం చేయాలని మల్లగుల్లాలు పడ్డారు అతని ఫ్యామిలీ మెంబర్స్. స్థానికుల సలహా మేరకు ఆయనకు నచ్చిన వంటకాలతో పాటు ఆయన నిత్యం ఆడే పేక ముక్కలను కూడా ఓ విస్తరిలో ఉంచారు. ఆయనకు నచ్చిన వస్తువులను కూడా అక్కడ ఉంచి పక్షి రాకకోసం ఎదురు చూస్తుండగా ఠక్కున పిట్ట రావడం వంటకాలను తినడం చకాచకా జరిగిపోయాయి. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తి సంతృప్తి చెందాడన్న సంబరంతో కుటుంబ సభ్యులు మిగతా తంతు జరిపించే పనిలో నిమగ్నం అయ్యారు. తెలంగాణలో మరణించిన వ్యక్తికి ఇచ్చే ప్రయారిటీతో తమకు పై నుండి చనిపోయిన వారు ఆశీస్సులు అందిస్తారన్న నమ్మకంతో ఉంటారనడానికి జమ్మికుంట ఘటన ప్రత్యక్ష్య సాక్ష్యంగా నిలుస్తోంది.

You cannot copy content of this page