బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లేఖ
మరి కొద్ది సేపట్లో రాష్ట్రపతిని కలిసే అవకాశం
దిశ దశ, న్యూ ఢిల్లీ:
లోకసభ ఎన్నికల ఫలితాల్లో అంచనాలు తారుమారు కావడంతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమి పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్న అనుమానాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏన్డీఏ కూటమికి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇండియా కూటమి నేత తేజస్వీ యాదవ్ ఇద్దరు కూడా ఒకటే ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరి వెల్తున్నారన్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇండియా కూటమికి నితీష్ కుమార్ మద్దతు ఇస్తారా లేక… ఏన్డీఏ కూటమిలోనే కొనసాగుతారా అన్న చర్చ సాగింది. అయితే ఢిల్లీకి చేరుకున్న తరువాత నితీష్ కుమార్ మాత్రం నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్టుగా తెలుస్తోంది. తన పార్టీ మద్దతు ఏన్డీఏ కూటమికేనని లేఖ కూడా ఇచ్చినట్టుగా సమాచారం. మరో వైపున టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూడా ఏన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా లేఖ ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారు అయినట్టుగా ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ఏన్డీఏ పక్షాల నేతలను తీసుకుని రాష్ట్రపతిని కలిసి లేఖలు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసినట్టుగా సమాచార. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకునే పనిలో బీజేపీ ముఖ్యనేతలు నిమగ్నం అయ్యారు. ఈ రోజు సాయత్రం 6 గంటల ప్రాంతంలో ఇండియా కూటమి పార్టీల సమావేశం కానున్న నేపథ్యంలో అప్పటికే రాష్ట్రపతికి మద్దతు లేఖలను అందించి మ్యాజిక్ ఫిగర్ ఉందని వివరించాలని భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో రాష్ట్రపతిని కలిసి లేఖలు ఇచ్చినట్టయితే ఇండియా కూటమి సమావేశానికి ముందే ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంటే బెటర్ అని జాతీయ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఉన్న ఏన్డీఏ పక్ష పార్టీల ముఖ్య నాయకులు రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు.
https://x.com/TimesAlgebraIND/status/1798318619686027710?t=6v3LU9J0iJXML7TyuJJZvw&s=08