ఎయిర్ పోర్టుల్లో హై అలెర్ట్
భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని కొన్ని దేశాలకే పరిమితం అయిన ఈ వైరస్ ఇండియా తలుపు తట్టింది. ఒమ్రికాన్ బీఎఫ్ -7 వేరియంట్ గా పిలుస్తున్న ఈ వైరస్ ఓ మహిళకు సోకినట్టుగా ప్రాథమికంగా నిర్దారించారు. ఎన్ఆర్ఐ అయిన ఈ మహిళ బాధితురాలు గుజరాత్ లోని వడోదరకు చేరుకున్న తరువాత్ వైరస్ బారిన పడ్డారని గుర్తించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఒడిషాలోనూ మరోకరికి కూడా ఈ వ్యాధి సోకినట్టుగా గుర్తించారు. గుజరాత్ లో రెండు కేసులు ఒడిషాలో ఒక బిఎఫ్-7 కేసు నమోదయినట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లో హై అలెర్ట్ గా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చైనాలో తాజాగా జరుగుతున్న కరోనా వ్యాప్తికి ఈ బిఎఫ్-7 వేరియంట్ కారణమని చెప్తున్నారు.
గంటల్లోనే…
చైనాలో పెద్ద సంఖ్యలో కొత్త వేరియంట్ బారిన పడ్డారన్న వార్తలు వెలువడిన కొన్ని గంటల్లోనే ఇండియాలోనే బాధితురాలిని గుర్తించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ వేరియంట్ ను ఆదిలోనే కట్టడి చేసేందుకు మళ్లీ కోవిడ్ రూల్స్ ను కఠిన తరం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే మాస్కు మస్ట్ గా వినియోగించాలన్న సూచలను కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రాష్ట్రాల్లో కనిపిస్తే మాత్రం విదేశీ విమానాలను నిలిపివేయడంతో పాటు ఇతరాత్ర నిభందనలను కఠినతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post