కరీంనగర్ వేదికగా ‘టాస్’ తొలి సభ

కార్యరంగంలో జేఏసీ…

దిశ దశ, కరీంనగర్:

ఉద్యమకారులంతా ఒకే గొడుగు కిందకు రాబోతున్నారు. స్వరాష్ట్ర కల సాకారం కోసం ఉద్యమాలు కొనసాగించిన వారంతా తమ ఐకమత్యంగా తమ గళాన్ని వినిపించబోతున్నారు. పార్టీలకతీతంగా ఏర్పాటయిన జాయింట్ యాక్షన్ కమిటీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం తెలంగాణ పోరాటానికి జీవం పోసిన కరీంనగర్ నుండే పోరుబాటను ప్రారంభించాలని నిర్ణయించింది జేఏసీ.

సన్నాహక సమావేశం

తెలంగాణ ఆవిర్భావం కావాలన్న ఆకాంక్షతో పోరుబాట పట్టిన ఉద్యమ కారులంతా ఒకే వేదిక మీదకు రావాలని భావిస్తున్నారు. తొలి దశ, మలి దశ ఉద్యమాల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగడం లేదని గుర్తించిన ఉద్యమ కారులంతా తుది దశ పోరుకు సిద్దమయ్యారు. తెలంగాణ అమరుల ఆశయ సాధన (టాస్) జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కటుకం మృత్యుంజయం ఛైర్మన్ గా జిల్లాల వారిగా ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ముఖ్యనాయకులంతా హైదరాబాద్ లో సమావేశం అయి టాస్ కార్యాచరణను రూపొందించారు. మొదటి సారి ఆగస్టు 7న కరీంనగర్ లో టాస్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వ రాష్ట్రం సిద్దించినప్పటికీ ఉద్యమ కాలంలో ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదని, పెనం మీద నుండి పోయ్యిలో పడిన విధంగా నేడు పరిస్థితులు తయారయ్యాయని గుర్తించిన ఉద్యమకారులు టాస్ ద్వారా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం కరీంనగర్ మైత్రీ హోటల్ లో టాస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఆగస్టు 7న కరీంనగర్ పద్మనాయిక కళ్యాణ మంటపంలో నిర్వహించ తలపెట్టిన సమావేశం గురించి చర్చించింది టాస్ జేఏసీ. ఉద్యమ కారులంతా పార్టీలకు అతీతంగా ఏకమై పోరుబాట పట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని టాస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ఉద్యమకారులంతా హాజరయ్యే విధంగా చొరవ తీసుకోవాలని భావించారు. ఈ సన్నాహక సమావేశానికి టీ జేఏసీ ఛైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్, మాజీ ఛైర్మన్ వెంకట మల్లయ్య, ఏఐఎఫ్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, బీఎస్ఎస్ అధ్యక్షుడు జనగామ నరేష్, డీఎల్ఎఫ్ నేత మార్వడి సుదర్శన్, మాజీ మేయర్ డి శంకర్, కాంగ్రెస్ నాయకుడు సంగీతం శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు అనిల్, గుమ్మడి కుమార్ స్వామి, ఎలగందుల మల్లేశం, బీజేపీ నాయకుడు బోయినపల్లి ప్రవీణ్ రావు, కటుకం లోకేష్, జొన్నల రమేష్, దిండిగాల మధు, మూల జైపాల్, చింతల కిషన్, గర్రెపల్లి ప్రభాకర్, రాజాసింగ్, పర్ష రాములు, భాస్కర్, కూడలి శ్రీధర్, అన్నల్ దాస్ వేణు, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎండీ అమీర్, వరంగల్, జగిత్యాల జిల్లాల అమర వీరుల సంఘం అధ్యక్షుడు ఉప్పలయ్య, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

You cannot copy content of this page